“తెలుగు భాషా దినోత్సవం” సందర్భంగా మాకు మీరు నిర్వహించిన కార్యక్రమం లో పాలు పంచుకొనే అవకాశం కలగడం వాళ్ళ మీరు మరుగున పడుతున్న కళలను భావితరాలకు యధాతదంగా భావితరాలకు అందించాలని చేస్తున్న మీ ప్రయత్నాలను దగ్గరనుంచి గమనించి WETA టీం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము.

ఈ కార్యక్రమం ద్వారా కోవిడ్ వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు కళాకారులకి మీరు ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష, సంస్కృతి లో ఉన్న ఔన్నత్యం కాపాడు కోవాలనే ఉద్దేశ్యంతో “వీధి అరుగు” చేపడుతున్న కార్యక్రమాలని WETA టీం అభినందిస్తోంది. గతంలో కూడా మీరు నిర్వహించిన ” కూచిపూడి వైభవం- తెలుగు సౌరవభం” , “కృష్ణ రాయని విశిష్టత” ‘ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ” సప్త ఖండ అవధాన సాహితీ ఝరి ” లాంటి ఎన్నో కార్యక్రమాలను వీక్షించడం జరిగింది. మీరు చేస్తున్న కార్యక్రమాలు మిగతా తెలుగు సంఘాలకు ఆదర్శమని WETA టీం భావిస్తూ.. శుభాభినందనలు…

Copyrights © Veedhi Arugu by WPVertex. All rights reserved