about-banner about-banner
about-bg

వీధి అరుఁగు కార్యక్రమం

arrow

పల్లె జీవనంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో విడదీయలేనంతగా పెనవేసుకున్న ఒక మధురమయన అనుభూతి వీధి అరుఁగు!!

పిచ్చాపాటి కాలక్షేపాల దగ్గర నుంచి, ప్రంపచ సమస్యల వరకు..ఖగోళ శాస్త్రం నుంచి మూఢ నమ్మకాల వరకు అన్నిటి చర్చావేదిక సమాలోచనల కూడిక పరిష్కారాల సూచిక ఈ వీధి అరుఁగు!!

పర్యావరణం గురించి, దాని భద్రత గురించి బెంగ అవసరం లేని ఒకప్పటి రోజుల్లో ఊరి విషయాలన్ని చర్చిచింపబడుతూ ఉండటానికి తావిచ్చింది ఈ వీధి అరుఁగు!!

బుర్రకధలు, తోలుబొమ్మలాటలు, సాంఘీకనాటకాలు ప్రదర్శింపబడే ఒక కళావేదిక మన వీధి అరుఁగు!!

మానవాళి అభివ్రుద్దికి విజ్ఞాన వినోదాలు ఎంతో అవసరం. వాటికి దివ్యవేదిక మన వీధి అరుఁగు..

మారుతున్న పరిస్థితులలో, ఎంతో సమాచారం సామాజిక ప్రసారమాధ్యమాలు ద్వారా అందుబాటులో ఉన్నా, పరిపూర్ణమైన ప్రామాణికమైన సమాచారం తెలుసుకోవటం కొంచెం కష్టతరమైన విషయం.

అందునా ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోవటం ఇంకా కష్టం. అటువంటి అడ్డంకులు తొలిగించేదుకు నిష్ణాతులైన వ్యక్తులతో సమాచారాన్ని నేరుగా మీకు అందించడమే కాకుండా, ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష, సంస్కృతి లో ఉన్న ఔన్నత్యం కాపాడుకోవాలనే చొరవకు చిరు ప్రయత్నమే మా ఈ “వీధి అరుఁగు “.

వీధి అరుఁగు ఆహ్వానం వంటిది. వీధి అరుగుని ఆదరించే భాషాభిమానులైన మీరందరు ఆత్మీయ అతిధులు.

about
our-mission

మన మన ఆశయం, ముఖ్య ఉద్దేశం, రూపకల్పన

arrow

A place where people come to converse. Every Telgite who is acquainted with the rural life has the fond experience of ‘ Veedhi Arugu’ that is inextricably intertwined with their life.

తెలుగు బాషా, సంస్కృతి, చరిత్ర మరియు సమకాలీన అంశాలు గురించి తెలుగు వారికి నాణ్యమైన సమాచారాన్ని అందించడం మరియు అవగాహనా కల్పించడం.

తెలుగు జాతి వికాసం వీధులు నుండి వినువీధుల వరకు

పల్లె జీవనంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో విడదీయలేనంతగా పెనవేసుకున్న ఒక మధురమయన అనుభూతి వీధి అరుగు!!

పిచ్చాపాటి కాలక్షేపాల దగ్గర నుంచి, ప్రంపచ సమస్యల వరకు..ఖగోళ శాస్త్రం నుంచి మూఢ నమ్మకాల వరకు అన్నిటి చర్చావేదిక ఈ వీధి అరుగు!!

our-mission

What People Are Says

arrow

శైలజ కల్లూరి, అధ్యక్షురాలు WETA

“తెలుగు భాషా దినోత్సవం” సందర్భంగా మాకు మీరు నిర్వహించిన కార్యక్రమం లో పాలు పంచుకొనే అవకాశం కలగడం వాళ్ళ మీరు మరుగున పడుతున్న కళలను భావితరాలకు యధాతదంగా భావితరాలకు అందించాలని చేస్తున్న మీ ప్రయత్నాలను దగ్గరనుంచి గమనించి WETA టీం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము.

ఈ కార్యక్రమం ద్వారా కోవిడ్ వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు కళాకారులకి మీరు ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష, సంస్కృతి లో ఉన్న ఔన్నత్యం కాపాడు కోవాలనే ఉద్దేశ్యంతో “వీధి అరుగు” చేపడుతున్న కార్యక్రమాలని WETA టీం అభినందిస్తోంది. గతంలో కూడా మీరు నిర్వహించిన ” కూచిపూడి వైభవం- తెలుగు సౌరవభం” , “కృష్ణ రాయని విశిష్టత” ‘ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ” సప్త ఖండ అవధాన సాహితీ ఝరి ” లాంటి ఎన్నో కార్యక్రమాలను వీక్షించడం జరిగింది. మీరు చేస్తున్న కార్యక్రమాలు మిగతా తెలుగు సంఘాలకు ఆదర్శమని WETA టీం భావిస్తూ.. శుభాభినందనలు…

Copyrights © Veedhi Arugu by WPVertex. All rights reserved