About Us
The program is designed to promote telugu culture, literature, history, sports, arts and contemporary topics through virtual talks by eminent telugu speakers.
Organization Number (Norway): 927200333
వీధి అరుగు… ఒకప్పుడు జ్ఞానాన్ని పంచే కల్పతరువు.
తలపండిన పెద్దలంతా తమ జీవితపు అనుభవసారాల్ని, పురాణాల్ని ,ఇతిహాసాల్ని పద్యాల్ని ,నీతికథల్ని ,వార్తల్ని ,పూర్వీకుల పరాక్రమాలని ఇలా ఒకటేమిటి జీవితానికి అవసరమయ్యే విలువల్ని,నీతిని, జ్ఞానాన్ని బోధించేవారు మన వీధి అరుగుల మీద.
గజిబిజి పరుగుల జీవితంలో, జీవనపోరాటంలో నూతన నైపుణ్యాలను నేర్చుకునే క్రమంలో, కొంత నాగరికత మోజులో మరికొంత కోల్పోతున్న సంస్కృతీ సంప్రదాయాల్ని, అలనాటి పల్లెల జ్ఞాపకాలను,స్థితిగతులను,బ్రతుకు మూలలను ఈ తరానికి అందించడానికి.
వివిధ రంగాల్లో సేవలందిస్తూ, సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతూ, భాషను బ్రతికిస్తూ, దేశపు కీర్తిపతాకాల్ని రెపరెపలాడిస్తున్న తెలుగుతల్లి ముద్దుబిడ్డలతో వివిధ సామాజిక అంశాలు మీద ప్రతీ మాసాంతాన ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తూ.. వారి వారి రంగాల్లో అవలంభించాల్సిన పద్దతులతో పాటు వారి అనుభవాల్ని, సలహాల్ని, తెలుగువారి గొప్పతనాన్ని ఈ తరానికి చేరవేస్తూ, తద్వారా భాషను,సంస్కృతిని, సంప్రదాయాల్ని, సమకాలీన అంశాలకు పట్టం కట్టే బృహత్తర కార్యక్రమం.
వీధి అరుగు ఒక ఎల్లలు లేని ప్రపంచ వేదిక. ప్రపంచంలోని వివిధ తెలుగు సమాఖ్యలు అందరిని సమన్వయం చేసుకుంటూ తెలుగు భాషా, సంస్కృతి మరియు చరిత్రను ముందు తరాలకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేసి నిర్వహించడం.
తెలుగుభాషా దినోత్సవాలు, సృజనాత్మకతను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు, పండగల వెనకున్న గాథల్ని ,చరిత్రను, ఆ సంప్రదాయాల్లో నిగూఢంగా దాగి ఉన్న విజ్ఞానంను తెలియచేసే కార్యక్రమాలు.
చారిత్రక కట్టడాలు, మన పరిసరాలు, చారిత్రక ప్రదేశాలు, చారిత్రిక వ్యక్తులు నివసించిన ప్రాంతాలు, చారిత్రక వ్యక్తుల జన్మ స్థలం, వస్తు తయారీ కేంద్రాలు, భారీ వస్తు విక్రయ కేంద్రాలు వాటి మీద ప్రామాణిక సమాచారం అందించే కార్యక్రమాలు నిర్వహించడం.
భవిష్యత్ తరాలకు మూలస్తంభాలైన పిల్లలకు పురాణాలు ,ఇతిహాసాలు ,భగవద్గీత, పద్యాలు లాంటి వాటి మీద పోటీలు నిర్వహిస్తూ, వారిలో భాషపట్ల, తెలుగు సంస్కృతి పట్ల ఆసక్తిని రేకెత్తించి, వారు నేర్చుకోవడానికి పండితులు, ప్రముఖులచే తగిన సూచనలు ,సలహాలను అందిస్తూ.
వారికి చిన్నతనం నుండే ఒక విషయాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించి, వారిలోని సృజనాత్మకతను వెలికి తీసి, వారిలో దాగి ఉన్న కళలను, నైపుణ్యాలను బయటకు తీసి కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తూ.
నాగరిక సమాజంలో పల్లె జీవనాల్ని ,ప్రశాంత వాతావరణాల్ని, పద్ధతులని ,సంప్రదాయాల్ని వారికి తెలియజేస్తూ.. తద్వారా జ్ఞానాన్ని, దేశభక్తిని, భాషపైన ప్రేమను ,మంచి నడవడికను చిన్నతనంనుండే అందించే ప్రయత్నం చేస్తూ, తెలుగు వెలుగును ,సంప్రదాయాల్ని అంతరించకుండా కాపాడే ధీరులుగా తయారుచేయడానికి తమవంతుగా వీధి అరుగు చేసే కృషే ఈ పిల్లల కార్యక్రమాలు.
Copyrights © Veedhi Arugu by WPVertex. All rights reserved