అందరికి నమస్కారం!

ప్రపంచం వేగంగా పరిగెడుతుంది. గత మూడు దశాబ్దాలలో సాంకేతిక రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకొంటున్నాయి. ఈ మార్పులు హద్దుల్ని చెరిపివేస్తున్నాయి. ప్రపంచమే ఒక కుగ్రామం గా మారిపోతుంది. ఈ మార్పులని అంది పుచ్చుకొని మన తెలుగు వారు ఉపాధి కొరకు ప్రపంచ నలుమూలకు విస్తరించారు. వారి తో పటు వారి భాషను, సంస్కృతి ని కూడా ప్రపంచానికి పరిచేయం చేస్తున్నారు. ఇలా వెళ్ళిన వారిలో ఎక్కువ మంది గ్రామీణ నేపథ్యం కలవారే. వారి అందరికి వీధి అరుగులు ఎంతో సుపరిచితం.

తెలుగు భాషకి ఎల్లలు లేవని చెప్పడంతో పాటు, తెలుగు సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణతో పాటు, వాటిని నేటి సమాజానికి తెలియచేసే వేదికగా వీధి అరుగుని రూపకల్పన చేయడం జరిగింది.

వివిధ దేశాలలో ఉన్న ప్రతినిధులతో కలిసి వీధి అరుగు విన్నూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు జాతి వికాసం వీధుల నుండి వినువీధుల వరకు తెలియజేస్తుంది.

Copyrights © Veedhi Arugu by WPVertex. All rights reserved